EndukanI… EmiTanI…
bigibigi cherasaala bigisenu priyuraalaa
chiTapaTa chiru jwaala kurisenu hRdayaalaa
manasE avutOndi masibaarina kiraNamlaa
valapE migilindi taDi aarani nayanamlaa
amaavaasyapu gaganamlaaa
endukanI… EmiTanI…
nee aDugulalO aDugulu vEsi naDichina bandhamidaa
onTaritanamE kshaNamoka yugamai migilE EmiTilaa
aarina pedavula maaTalika naa maaTalika
chEruna cheli nee daakaa daakaa daakaa
priyatamaa nammumaa praaNam unnadi neekOsam
naa kanulalO unnadi nee roopam
endukanI… EmiTanI…
velugulu chilikE chiru jaabilini mabbulu kamme ilaa
chigurulu toDigE chiru nagavulapai cheeDE chErenelaa
chilipiga chEsina baasalilaa aa baasalilaa
naa madinE tolichEnaa tolichEnaa
kaaTukai chEranaa kanTilO daagina kanneerai
nee chekkili taakana chiru aaSai
endukanI… EmiTanI…
bigibigi cherasaala bigisenu priyuraalaa
chiTapaTa chiru jwaala kurisenu hRdayaalaa
manasE avutOndi masibaarina kiraNamlaa
valapE migilindi taDi aarani nayanamlaa
amaavaasyapu gaganamlaaa
endukanI… EmiTanI…
Telugu
ఎందుకనీ… ఏమిటనీ…
బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా
చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ… ఏమిటనీ…
నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిదా
ఒంటరితనమే క్షణమొక యుగమై మిగిలే ఏమిటిలా
ఆరిన పెదవుల మాటలిక నా మాటలిక
చేరున చెలి నీ దాకా దాకా దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం ఉన్నది నీకోసం
నా కనులలో ఉన్నది నీ రూపం
ఎందుకనీ… ఏమిటనీ…
వెలుగులు చిలికే చిరు జాబిలిని మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరు నగవులపై చీడే చేరెనెలా
చిలిపిగ చేసిన బాసలిలా ఆ బాసలిలా
నా మదినే తొలిచేనా తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై
నీ చెక్కిలి తాకన చిరు ఆశై
ఎందుకనీ… ఏమిటనీ…
బిగిబిగి చెరసాల బిగిసెను ప్రియురాలా
చిటపట చిరు జ్వాల కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్యపు గగనంలా
ఎందుకనీ… ఏమిటనీ…
Source URL: https://ojoknesublogs.blogspot.com/2010/10/143-i-miss-you-endukani-lyrics.htmlVisit ojok nesu blogs for Daily Updated Hairstyles Collection
No comments:
Post a Comment