jai bolo shankara maharajkee
bolo kasheevishwanadh ki
hara hara hara hara mahadev(jai bolo)
shre gangaa nelanti manaseeyave
janmantaa ne bata nadipinchave
shivapujanu shivapujanu karuninchave
priyasevalo tariyinchu varamiyyave
kashee vaasaa sambashiva kaache tandri mahadevaa
ponge gange ne chalava karunaku lede ye kodava
madilo korika teere margam kavaa
jai bolo shankara maharajki
hara hara mahadev
jagamelu shivashankaraa
jagamelu shivashankaraa
nuvvunte makinka bhayamendiraa
yeda nindugaa nuvvundagaa
chirunavvulannee maveraa
ne kantichupu chitikeste chalu
kalaganna mata nijamaipotadiraa(jagamelu)
nippu neeru rentinee
nippu neeru rentinee jatagaa nilipavugaa
vidduram chupavugaa ne leelato
nelavankaku todugaa velugai nuvvundagaa
amaavasya ledugaa kalalo ilalo
neeve daivam upiriki neede bharam ennatikee
alochanalo ne uniki aashadeepam repatiki
ne daya pondina punyam madaiponee(jai bolo)
sanipani sari sanipani sari mapanisaa(2)
risanisa rima risanisa rima panisari(2)
sarisani danipama gamanipa magarinisaa(2)
aaradhinche tondara
aaradhinche tondara aage veelleduraa
maaredai manasundira ne mundara
ne challani needalo nelavunte chalura
abhayamga iyyara adige anaraa
veeche gale sakshyamata ningi nele sakshyamata
atmaadeham okkatiga neelaa rupam dalchenata
pranavam nuvvai pranam pondenu prema(jai bolo)
Telugu
జై బోలో శంకర మహరాజ్ కీ
బోలో కాశీవిశ్వనాద్ కీ
హర హర హర హర మహాదేవ(జై బోలో)
శ్రీ గంగా నీలాంటి మనసీయవే
జనమంతా నీ బాట నడిపించవే
శివపూజను శివపూజను కరుణించవే
ప్రియసేవలో తరియించు వరమియ్యవే
కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహాదేవా
పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావా
జై బోలో శంకర మహారాజ్ కీ
హర హర మహాదేవ
జగమేలు శివశంకరా
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింకా భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా(జగమేలు)
నిప్పు నీరు రెంటినీ
నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా
విడ్డూరం చూపావుగా నీ లీలతో
నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ
ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి
నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ(జై బోలో)
సనిపని సరి సనిపని సరి మపనిసా(2)
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి(2)
సరిసాని దానిపమా గమనిప మగరినిసా(2)
ఆరాధించే తొందర
ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా
మారేది మనసుందిరా నీ ముందర
నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా
అభయంగా ఇయ్యరా అడిగే ఆనరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట
అత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట
ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ(జై బోలో)